Adipurush : “ఆదిపురుష్” లో ప్రభాస్ రాముడే కానీ..చాలా మార్చరట! అవేంటో తెలుసుకోండి!

Adipurush : ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు అనేక ఇంట్రెస్టింగ్ భారీ చిత్రాల్లో షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయిన భారీ సినిమాలు కొన్ని ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి.

భారీ తారాగణంతో ఇప్పటికి ఇండియన్ సినిమా దగ్గర అత్యధిక బడ్జెట్ తో పాటు భారీ విజువల్స్ ఉన్న సినిమా ఇదే. అయితే రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ రామునిగా బాలీవుడ్ స్టార్ నటి కృతి సనన్ సీతగా కనిపిస్తారన్న సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడు ఈ సినిమాలో వారి పాత్రలపై ఇంట్రెస్టింగ్ సమాచారం ఇప్పుడు తెలుస్తుంది. దర్శకుడు ఓంరౌత్ నేషనల్ మీడియా తో మాట్లాడుతూ ఈ సినిమాలో చాలా మార్పులు ఉంటాయని కొంతమందికి తెలియని కోణాలు చూపించమని తెలిపాడు.

అంతే కాకుండా ప్రభాస్ పాత్ర రాముడే కానీ సినిమాలో ‘రామ’ అనే పేరుతో తన పాత్ర పిలవబడదు అట. ‘రాఘవ’ అనే పిలవబడుతుంది అని తెలిపాడు. అలాగే ఇదే రకంగా కృతి సనన్ పాత్ర కూడా సీత అని ఉండదు అట. ఆమె పాత్ర జానకి అని మాత్రమే పిలవబడుతుంది అట. దీనితో దర్శకుడు చేసిన ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.