Bala Krishna: అఖండ సినిమాలో బాలయ్య కూతురుగా నటించిన బుడ్డది ఎవరో తెలుసా?

Bala Krishna: బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం, అఘోర పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో కథని మొత్తం కీలక పాత్రలో నడిపించే చిన్నారి పాత్ర ఈ సినిమాకి హైలెట్ అయ్యింది. ఈ చిన్నారి వల్ల సినిమాలో కీలక మార్పులు జరుగుతాయి. ఇందులో ఆ చిన్నారి బాలకృష్ణ కూతురి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది. ఈ క్రమంలోనే ఈ చిన్నారిపై నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ అసలు ఈ చిన్నారి ఎవరు అంటూ పెద్దఎత్తున సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

మరి ఈ సినిమాలో చిన్నారి పాత్రలో నటించిన బుడ్డ దాని పేరు దేష్ణ. ఈ చిన్నారి ఎలాంటి ఆడిషన్స్ లో పాల్గొనకుండా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇలా మొట్ట మొదటి చిత్రమే భారీ చిత్రంలో అవకాశాన్ని దక్కించుకుని ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దేష్ణ ఒక సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి.ఈ క్రమంలోనే ఈమె తల్లిదండ్రులు తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఆ ఫోటోలను చూసిన అఖండ చిత్రబృందం తమ సినిమాలో చిన్నారి పాత్రలో నటించడానికి తన కరెక్ట్ గా సరిపోతుందని భావించారు.

ఇక తన గురించి వాకబు చేసి వెంటనే తన తల్లిదండ్రులతో ఈ విషయం గురించి మాట్లాడుతూ తన కూతురికి ఇలాంటి అవకాశం వచ్చినందుకు వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సినిమాకి ఒప్పుకున్నారు. ఇలా కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ చిన్నారికి అఖండ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తాజాగా వారి తల్లిదండ్రులు వెల్లడించారు. తను నటించిన మొదటి సినిమా విజయవంతం కావడంతో తన కూతురికి మరిన్ని అవకాశాలు వస్తున్నాయని చిన్నారి తల్లిదండ్రులు తెలియజేశారు.