Varsha: జబర్దస్త్ వేదికపై ఎర్రకోతి అంటూ వర్షకు జరిగిన అవమానం..!

Varsha: బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన స్కిట్ ద్వారా విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుని దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇందులో బుల్లెట్ భాస్కర్ ఇమ్మానియేల్ అత్త పాత్రలో నటించారు. బుల్లెట్ భాస్కర్ కోడలిగా వర్ష సందడి చేయగా ఇమ్మానియేల్ కోడలుగా ఫైమా సందడి చేసింది. ఇక బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ నా కోడలు చూడు ఎంత ఎర్రగా బుర్రగా ఉందో అంటూ వర్ష గురించి పొగడగా వెంటనే ఫైమా అత్త పాత్రలో నటిస్తున్న ఇమ్మానియేల్ కోతి కూడా ఎర్రగా ఉంటుంది అంటూ పరోక్షంగా వర్షను కోతి అంటూ కామెంట్ చేశారు.

ఇక నా కొడుకు ఎలా పెంచాలో తెలుసా అంటూ చెప్పడంతో వెంటనే ఫైమా జోడి వస్తారు.ఈ సందర్భంగా బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ వచ్చిందండి గుంటూరు బస్టాండ్ లో చెవిలో గుల్ గుల్ తీసినదాన్ని తీసుకొచ్చాడు అని చెప్పడంతో అక్కడున్న వారందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. ఇక వీరిద్దరూ పోటీగా వారి కోడలితో సేవ చేయించుకోవడం, వారిని ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇద్దరు అత్తలు వారి కోడల్లకు ముగ్గు వేయమని పోటీ పెడతారు. ఈ సందర్భంగా పైమా ఎలాంటి ముగ్గు వేయమంటారు అత్తయ్య అంటూ అత్త పాత్రలో చేస్తున్నటువంటి ఇమ్మానియేల్ అని అడుగుతుంది.

ఇక ఫైమా అలా అడిగే సరికి ఇమ్మానియేల్ రథం ముగ్గు వేయవే అని చెబుతుంది. ఎక్కడ వేయమంటారు అంటూ పైమా అడగడంతో ఇమ్మానియేల్ ఏకంగా నా నడ్డి మీద ముగ్గువేయి అంటూ సమాధానం చెప్పగా ఆ మాటకు ఫైమా అత్తయ్య గారు చాలా ఈజీ ఎలాగో రెండు చక్రాలు ఉంటాయి కదా బొమ్మ వేయడమే ఆలస్యం అంటూ ఫైమా చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ నవ్వులు కురిపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఇక వీరందరూ చేసిన కామెడీ పూర్తిగా చూడాలంటే ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు వేచి చూడాలి.