Radhe Shyam Hindi Run Time : ఇన్సైడ్ టాక్స్ : “రాధే శ్యామ్” హిందీ నిడివి బయటకి వచ్చేసిందా.?

Radhe Shyam Hindi Run Time : ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “రాధే శ్యామ్” కోసం ఇండియన్ వైడ్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ అద్భుతమైన విజువల్స్ తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాడు.

మరి పాన్ ఇండియన్ సినిమాగానే ప్లాన్ చేసినా ఈ చిత్రాన్ని అయితే ఆసియా లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రభాస్ కి తెలుగులో ఎంతైతే మార్కెట్ ఉందొ అంతకు మించిన మార్కెట్ బాలీవుడ్ లో ఉందని చెప్పాలి.

బాలీవుడ్ లో తన ప్లాప్ సినిమా కూడా 300 కోట్లు కలెక్ట్ చేసింది అంటే తన క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. మరి అందుకే రాధే శ్యామ్ ని కూడా హిందీలో కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఆ మధ్య అలాగే హిందీ మరియు తెలుగు సినిమాల నిడివి లు తేడాదిగా ఉంటాయని టాక్ వినిపించింది.

ఇప్పుడు ఇది నిజమే అన్నట్టు తెలుస్తుంది. హిందీలో రాధే శ్యామ్ ఎంత సేపు వచ్చింది అనే నిడివి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకి హిందీలో యూ/ ఏ సర్టిఫికెట్ దక్కగా 153 నిమిషాలు ఈ సినిమా హిందిలో ఉండనున్నట్టు తెలుస్తుంది. దీనితో ఇప్పుడు ఈ రన్ టైం వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకి హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మార్చ్ 11న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.