Radhe Shyam : ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు నిజంగానే ఒక బ్రాండ్ గా మారింది అనిక్ చెప్పాలి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ దగ్గర జస్ట్ తన పేరుతోనే రికార్డు స్థాయి బిజినెస్ లు జరుగుతున్నాయి. ఇంకా ప్రభాస్ డేట్స్ దొరికితే చాలు నిర్మాతలు ఎంతైనా రెన్యుమరేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
మరి ఈ క్రేజ్ అంతా ఎందువల్ల దానికి కారణంగానే చిన్న శాంపిల్ వార్త ఇపుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. తాను హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం అవ్వడానికి క్లాస్ సినిమానే అయినా దీనికి జరుగుతున్న బిజినెస్ మాత్రం వేరే లెవెల్లో ఉంది.
లేటెస్ట్ గా అయితే ఈ సినిమా తాలూకా నాన్ థియేట్రికల్ బిజినెస్ కి సంబంధించి డీల్ కోసం తెలుస్తుంది. ఒక్కడా ఓటిటి మరియు శాటిలైట్ హక్కులే ఈ సినిమావి ఏకంగా 250 కోట్లకు అమ్ముడుపోయాయట. అంటే ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ డీల్ ఇండియాలోనే రెండో అతి పెద్ద డీల్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
మరి ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ సినిమా అంచనాలు ఇప్పుడు మరింత ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాని రాధా కృష్ణ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రానున్న మార్చ్ 11న విడుదల కావడానికి రెడీగా ఉంది.