KGF Chapter 2 : ఇన్సైడ్ టాక్ : ఫైనల్ గా “కేజీఎఫ్ 2” నుంచి బిగ్గెస్ట్ అప్డేట్ రాబోతోందా?

KGF Chapter 2 : ప్రస్తుతం పాన్ ఇండియా వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రాకింగ్ స్టార్ యష్ మరియు శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ ఏక్షన్ డ్రామా “కేజీఎఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. ఓ రకంగా చెప్పాలి అంటే మన ఇండియన్ సినిమా దగ్గర బాహుబలి 2 తర్వాత అంతకు మించిన అంచనాలతో ఓ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే అది ఇదే అని చెప్పాలి.

గత ఏడాది రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ కి అయితే ఏకంగా ప్రపంచ స్థాయి రెస్పాన్స్ నే వచ్చింది. అందుకే ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ అయినా కూడా బిగ్గెస్ట్ అప్డేట్ అనే చెప్పాలి. ఐతే ఈ చిత్రం నుంచి అభిమానులు ఆసక్తిగా అని కాదు కానీ అసలు మర్చిపోయిన అప్డేట్ ఏదన్నా ఉంది అంటే ఈ సినిమా సాంగ్స్ అనే చెప్పాలి.

ఎందుకో ఈ సినిమా సాంగ్స్ కోసం పెద్దగా బజ్ లేదు. మొదటి పార్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అంతా సూపర్ హిట్ అయినా ఎందుకో మిగతా హైప్ దగ్గర సాంగ్స్ మాత్రం చిన్నబోయాయి. మరి ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ పై క్రేజీ అప్డేట్ తెలుస్తుంది.

ఈ టాక్ తో అయితే చిత్ర బృందం ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ని ఈ ఫిబ్రవరి 25కి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. అన్ని భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇన్సైడ్ టాక్. మరి ఈసారి రవి బాసృర్ ఎలాంటి సంగీతం అందించాడో చూడాలి.