ఇన్సైడ్ టాక్ : ఎన్టీఆర్ భారీ సినిమాపై అప్డేట్ అప్పటికి ఫిక్స్ అయ్యిందా.?

NTR s big update  : దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ మరియు భారీ అయినటువంటి ట్రిపుల్ ఆర్(RRR) లో ఓ హీరోగా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఖాతాలో భారీ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు.

తన కెరీర్ లో 30వ సినిమాగా ప్లాన్ చేసిన ఈ సినిమా చాలా పెద్ద స్కేల్ లోనే చేస్తున్నట్టు దర్శకుడు ఇది వరకే క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి నటి ఆలియా భట్ తప్పుకుందన్న రూమర్స్ ఆ మధ్య వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇన్సైడ్ టాక్ ప్రకారం అయితే ఈ మే 20న ఓ మాసెస్ట్ అప్డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే అది హీరోయిన్ మీద అయినా కావచ్చు లేదా ఎన్టీఆర్ పై కూడా కావచ్చని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఆరోజుకి మాత్రం డెఫినెట్ గా ఓ సాలీడ్ అప్డేట్ మాత్రం పక్కా అని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే హీరోయిన్ గా రష్మికా మందన్నా ఫిక్స్ అయ్యింది అంటున్నారు మరి దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.