Hat Trick Remake For Pawan Kalyan : రీమేక్ హ్యట్రిక్: కానీ, ఎందుకు పవన్ కళ్యాణ్.?

Hat Trick Remake For Pawan Kalyan

Hat Trick Remake For Pawan Kalyan : ‘భీమ్లానాయక్’ హోరు, జోరు ఇంకా తగ్గలేదు. ఇంతలోనే, మరో రీమేక్ సినిమా తెర మీదకు రాబోతోంది. ఔను, ‘వినోదయ సితమ్’ అనే తమిళ సినిమాని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహించి, నటించిన సినిమా ఇది.

‘వకీల్ సాబ్’.. ఆ తర్వాత ‘భీమ్లానాయక్’.. ఇలా వరుసగా రీమేక్ సినిమాలే చేస్తున్నారు పవన్ కళ్యాణ్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్ట్రెయిట్ మూవీ ‘హరిహర వీరమల్లు’, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందాల్సిన స్ట్రెయిట్ సినిమా ‘భవదీయుడు భగత్‌సింగ్’.. క్రమంగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి.

నిజానికి, అరడజను సినిమాలకు పైనే లైనప్ వున్నా.. ఇంతలో కొత్త కొత్త ప్రాజెక్టులు మధ్యలోకి వచ్చేస్తున్నాయి. దాంతో, అభిమానులకే అర్థం కావడంలేదు.. పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటన్నది.

రీమేక్ సినిమాలతో ఓ వెసులుబాటు వుంటుంది. కథ కోసం పెద్దగా కసరత్తులు అవసరం లేదు. సినిమా నిర్మాణం వేగంగా జరిగిపోతుంది. దాంతోపాటుగా, పవన్ ఎంచుకుంటోన్న సినిమాలు చాలా చాలా ప్రత్యేకమైనవి. ‘వకీల్ సాబ్’ సినిమా ఎక్కువ భాగం కోర్టు సెట్టులోనే జరిగిపోయింది.

‘భీమ్లానాయక్’ విషయానికొస్తే, ఇదీ కొంత లిమిటెడ్ ప్రాంతంలోనే షూటింగ్ జరిపేశారు. మరి, ‘వినోదయ సితం’ మాటేమిటి.. ఇందులో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడు. సో, పవన్.. అటు రాజకీయాల్ని, ఇటు సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో భాగంగానే ఈ తరహా సినిమాల్ని ఎంచుకుంటున్నాడన్నమాట.