Direct OTT : ఇన్సైడ్ టాక్ : ఓ బిగ్ బడ్జెట్ భారీ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్! అదేసినిమా??

Direct OTT :  గత రెండు మూడేళ్లు తిరగేసి చూసుకున్నట్టైతే మొత్తం ప్రపంచానికి పెద్దగా జరిగిన మంచి ఏదీ లేదు అని చెప్పాలి. అయితే ఈ కరోనా వేవ్స్ మూలాన అత్యంత తీవ్రంగా నష్టపోయిన ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది సినిమా ఇండస్ట్రీ అనే చెప్పాలి. దీనితో ఈ ఇండస్ట్రీ పెద్దలు తమ సినిమాలు ఎలా రిలీజ్ చెయ్యాలా అని చూస్తుండగా ఓటీటీ రూపంలో సమాధానం దొరికాయి.

ఇక అక్కడ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సినిమాలు నేరుగా ఓటీటీ లోనే విడుదల కాగా ఇప్పుడు మన ఇండియన్ సినిమా నుంచి ఒక భారీ సినిమా నేరుగా ఓటీటీ లో విడుదల కాబోతోంది అని ఒక టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఇంతలా హైప్ తో చెప్తున్న సినిమా అంటే మన టాలీవుడ్ నుంచే వస్తున్న భారీ సినిమాలు ఉన్నాయి.

వాటిలోని ఓ సినిమా నేరుగా ఓటీటీ లో విడుదల అవ్వబోతుంది అని సినీ వర్గాల్లో ఇప్పుడు నడుస్తున్న హాట్ ఇన్సైడ్ టాక్. దీనితో ఆ సినిమా ఏంటి అనేది ఆసక్తికరమైన ప్రశ్నాగా మారగా.. ఆ సినిమా ఏమిటి అనే దానిపై ఒక ఊహించని గాసిప్ కూడా వినిపిస్తోంది.

మరి అలా ఆ సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్” కూడా అవ్వచ్చని తెలుస్తోంది. కానీ ఇందులో ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. అలాగే ఇది కాకుండా వేరే భారీ సినిమాలు అంటే ఆల్రెడీ రిలీజ్ డేట్ లు వారు ఫిక్స్ చేసుకొని ఉన్నారు. మరి అసలు ఆ రిలీజ్ అయ్యే భారీ బడ్జెట్ సినిమా ఏదీ అనేది వేచి చూడాలి.