Radhe Shyam : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “రాధే శ్యామ్” ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ వింటేజ్ లవ్ స్టోరీ సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. కానీ మళ్లీ ఒక్కసారిగా దేశంలో పరిస్థితి మారిపోవడంతో దీనికి ముందు భారీ సినిమా అయినటువంటి ట్రిపుల్ ఆర్(RRR) వాయిదాతో ఆగిపోవడంతో భారీ ట్విస్ట్ ఇండియన్ సినిమా దగ్గర చోటు చేసుకుంది.
దీనితో అనేక ఇతర చిన్న చితకా సినిమాలు అన్నీ కూడా ఈ సంక్రాంతి బరిలోకి వచ్చేసాయి. కానీ ఊహించని విధంగా రాధే శ్యామ్ మాత్రం జనవరి 14నే తమ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు మళ్లీ ఓ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. మరి ఇది కన్ఫర్మ్ అయ్యినా ఈ సినిమా కూడా ఆగిపోతుంది అనే వదంతులు రాక మానలేదు. దీనితో ఈ సినిమా రిలీస్ పట్ల ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.
మరి ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ భారీ సినిమా వాయిదా వేసే యోచనలో లేనట్లే తెలుస్తోంది. ఇంకా చిత్ర బృందం సినిమా రిలీస్ పట్ల క్లారిటీ గానే ఉన్నారట. అందుకే వాయిదా విషయంలో వస్తున్న రూమర్స్ పై ఇంకా ఎలాంటి నిజం లేదని కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ భారీ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా యూవీ క్రియేషన్స్ వారు తమ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.