Hurdles For RRR Movie Release : ఇన్సైడ్ టాక్ – “RRR” రిలీజ్ కి చివరి నిమిషంలో కష్టాలు.. ఇది నిజమేనా..?

Hurdles For RRR Movie Release

Hurdles For RRR Movie Release : నో డౌట్ గా ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ట్రిపుల్ ఆర్(RRR) అనే చెప్పాలి ఇందులో సందేహం లేకుండా చెప్పొచ్చు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోస్ తో అంతే మాస్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

అయితే ఇప్పుడు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యి అంతా బాగానే ఉంది అనుకుంటే అనూహ్యంగా రిలీజ్ చివరిలో నిర్మాత డీవీవీ దానయ్యకి రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ షాకిస్తున్నారట. ముందు జరిగిన బిజినెస్ లో తగ్గించమని అడుగుతున్నారట.

అయితే దీనికి గాను దానయ్య 10 శాతానికి తగ్గిస్తానని చెప్పినా డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం 30 శాతం తగ్గించాలని అడుగుతున్నారట. దీనితో ఈ లాస్ట్ మినిట్ లో ఎందుకు ఈ మార్పు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

అలాగే దీనితో సినిమా కంటెంట్ లో ఏమన్నా తేడా గాని వచ్చిందా ఏంటి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మాత్రం లాస్ట్ లో పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గించమనడం ఎక్కడో అందరికీ కొడుతుంది. మరి ఫస్ట్ డే ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.