Big Star Got Corona : ఇన్సైడ్ టాక్ : మరో టాలీవుడ్ బడా హీరోకి కరోనా..! కానీ ఏమైందంటే?

Big Star Got Corona : గడిచిన రెండు మూడు వారాల్లో కూడా టాలీవుడ్ కి చెందిన అనేకమంది నటులు హీరోలు కరోనా బారిన పడిన సంగతి చూస్తూనే ఉన్నాము. ఒక్కో రోజు ఇద్దరు ముగ్గురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. మరి వారితో పాటుగా మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మరింత మంది స్టార్ నటులు సహా సీనియర్ నటులకు కూడా కరోనా రాగా మరింత ఆందోళన ఇప్పుడు నెలకొంది.

అయితే తాజాగా సినిమా వర్గాల్లో ఒక ఊహించని ఇన్సైడ్ టాక్ ఒకటి బయటకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మరో ప్రముఖ సీనియర్ స్టార్ హీరో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కబడ్డారట. కానీ ఈ హీరో తాను పాజిటివ్ వచ్చినట్టుగా అధికారికంగా చెప్పాలనుకోవట్లేదు అని అంతర్గత సమాచారం.

దీనితో ఈ హీరో ఎవరా అనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. మరి ఆ హీరో ఎవరు? ఎందుకు అధికారికంగా చెప్పాలి అనుకోవట్లేదు అని తెలియాల్సి ఉంది. ఇక మరో పక్క ప్రస్తుతం పెరుగుతున్న కేసులతో మళ్ళీ లాక్ డౌన్ తరహా ఆంక్షలు వస్తాయేమో అని సినిమా రిలీజ్ లు పట్ల మళ్ళీ భయం పట్టుకుంది. దీనితో అందరికీ ఇంకో టెన్షన్ స్టార్ట్ అయ్యింది.