Acharya : మెగా మాస్ “ఆచార్య” లో హైలైట్ అయ్యే అంశాలు ఇవేనట.!

Inside Report On Acharya

Inside Report On Acharya : ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉన్న క్రేజీ మల్టీ స్టారర్ “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు శివ కొరటాల మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కించిన ఈ సినిమా ఒక మెగా మాస్ ట్రీట్ గా రేపు విడుదల కాబోతుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా రేపు విడుదల ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ సినిమాలో హైలైట్ అంశాలపై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో ఫస్టాప్ అంతా కూడా ఒకెత్తు అయితే సెకండాఫ్ ఇంకో లెవెల్లో ఉంటుందట. ఫస్ట్ హాఫ్ అంతా ఒక రీతిలో యావరేజ్ గా సాగుతుంది కానీ సెకండాఫ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

అలాగే రామ్ చరణ్ పాత్ర ఇంటర్వెల్ కి ముందు వస్తుందని తెలుస్తుండగా సెకండాఫ్ మాత్రం ఎక్కడా తగ్గకుండా సాలీడ్ ట్రీట్ ఇచ్చేలా ఉండి సినిమాని నిలబెడుతుందట. ఇక అలాగే క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే వేరే లెవెల్లో ఉంటుందట. మొత్తం ఎర్రటి షేడ్ లో ఒక విజువల్ ట్రీట్ గా ఆడియెన్స్ ని ఆ సీక్వెన్స్ తప్పకుండా ఆకట్టుకుంటుంది అని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్.

మొత్తానికి అయితే ఈ సినిమాలో సెకండాఫ్ పై మాత్రం నచ్చి పాజిటివ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. మరి అదెలా ఉంటుందో చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మాణం వహించారు.