Koratala Siva : జస్ట్ మరో రోజులో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న భారీ సినిమా “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తీసిన ఈ బిగ్ మెగా మల్టీ స్టారర్ కోసం ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ పట్ల గత కొంత కాలం నుంచి కొన్ని ఊహాగానాలు పాన్ ఇండియా రిలీజ్ పై వినిపించాయి కానీ ఫైనల్ గా పాన్ ఇండియా రిలీజ్ లేకుండా కేవలం తెలుగులోనే అన్ని చోట్ల రిలీజ్ అవుతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఇదిలా ఉండగా అసలు ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఎందుకు ఒకేసారి చెయ్యలేదు అనేదానిపై కొరటాల స్పందించడం ఆసక్తిగా మారింది.
మొదట నుంచి మేము ఈ సినిమాని తెలుగు సినిమాగానే తీసాం ప్లాం చేశామని కాయాన్ని తర్వాత పాన్ ఇండియా లెవెల్లో అన్ని తెలుగు సినిమాలకి మంచి క్రేజ్ వచ్చింది. ఆ సమయంలో మేము కూడా చెయ్యాలా అని నిర్మాతలతో మాట్లాడ్డం కూడా జరిగింది.
కానీ తాము మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కంగారు పడే అవకాశం ఉంటుంది అలాగే క్రేజ్ ని డబ్బుగా మార్చుకోవడం అవసరం లేదనే ఆచార్య పాన్ ఇండియా రిలీజ్ విరమించుకున్నామని తాను ఒక క్లీన్ స్టేట్మెంట్ ని అయితే పాస్ చేశారు. దీనితో ఈ సినిమాపై అందరికీ మరింత క్లారిటీ వచ్చినట్టు అయ్యింది.