Jr NTR : ఇన్సైడ్ బజ్ : జూ. ఎన్టీఆర్ ది ఈ కీలక సినిమా ఆగిపోలేదా..?

Jr NTR :  లేటెస్ట్ గా ఇండియన్ సినిమా దగ్గర రిలీజ్ అయ్యిన భారీ సినిమాల్లో ఇండియన్  సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కీలక పాత్ర పోషించాడు.
అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ అలాగే కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ లతో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఓకే చెప్పాడు.
మరి ఈ సినిమాలపై ఇపుడు నుంచే భారీ స్థాయి అంచనాలు నెలకొనగా తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు కి కూడా అవకాశం ఇస్తున్నాడని తాను చెప్పిన కథ విని ఎన్టీఆర్ థ్రిల్ అయ్యి ఓకే చెప్పాడని ఆ మధ్య సినీ వర్గాల్లో టాక్ వచ్చింది.
కానీ రీసెంట్ గా ఎన్టీఆర్ ఇచ్చిన ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో తాను నెక్స్ట్ కొరటాల, ప్రశాంత్ నీల్ లతో చేయనున్నానని చెప్పాడు కానీ బుచ్చిబాబు సినిమా కోసం ఎక్కడా ప్రస్తావించలేదు. దీనితో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.
ఈ సినిమా ఆగిపోయింది అనే టాక్ కూడా వచ్చింది.
కానీ ఇప్పుడు ఇదే సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా ఆగలేదట. ఆ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ బుచ్చిబాబు తోనే సినిమా చేస్తాడని చెబుతున్నారు. సో ఈ సినిమాపై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసినట్టే.. అయితే ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు.