Radhe Shyam Ott : ఈ ఏడాదికి తెలుగు బాక్సాఫీస్ సహా పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలతో వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ భారీ విజువల్ ట్రీట్ ఫైనల్ గా భారీ డిజాస్టర్ ఫలితాన్ని మూటగట్టుకుంది. తన లాస్ట్ ఫిల్మ్ సాహో రేంజ్ వసూళ్లు కూడా అంత ఎందుకు ఆ సినిమాలో సగం కూడా ఈ సినిమాకి వసూళ్లు రాలేదు.
దీనితో రిలీజ్ అయ్యిన అన్ని చోట్లా ఈ సినిమా పెద్ద ప్లాప్ గా నిలిచిపోయింది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై ఒక ఫైనల్ క్లారిటీ అయితే ఇప్పుడు సినీ వర్గాలు నుంచి వినిపిస్తోంది. ఈ తాజా సమాచారం లెక్కన అయితే ఈ చిత్రం జస్ట్ ఈ వచ్చే ఏప్రిల్ మొదటి రెండు తేదీల్లోనే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు కొనుక్కున్న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్ప్రైమ్ వీడియో లో రానుందట.
మరి దానికి ఇంకా ఎన్నో రోజులు కూడా లేదని చెప్పాలి. అయితే ఈ సినిమాకి మాత్రం లాభం వచ్చింది మాత్రం ఈ ఒక్క డిజిటల్ మరియు శాటిలైట్ హక్కుల పరంగా అనే చెప్పాలి. ఈ ఒక్క హక్కులు 200 కోట్లకి పైగా రావడంతో మేకర్స్ బాగా సేవ్ అయ్యారు. లేకపోతే అంతే సంగతులు. ఇక ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం అందించగా యూవీ క్రియేషన్స్ వాళ్ళు నిర్మాణం వహించారు.