ఇండస్ట్రీ టాక్ : “విక్రమ్” మాస్ సీక్వెల్ ఎప్పుడు మొదలవ్వుద్ది అంటే.!

Kamal Haasan Vikram

ఇప్పుడు మన ఇండియన్ సినిమా దగ్గరకి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మల్టీ స్టారర్ ఏదన్నా ఉంది అంటే అది “విక్రమ్” సినిమానే అని చెప్పాలి. తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగ రాజ్ ఉలగ నాయగన్ కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లు కీలక పాత్రల్లో మరో స్టార్ హీరో సూర్య పవర్ ఫుల్ రోల్ లో కనిపించిన ఈ చిత్రం ఓ రేంజ్ లో హైప్ తో టాక్ ని సంతరించుకుని హిట్ అయ్యింది.

 

భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా చూసి ఆడియెన్స్ బాగా థ్రిల్ కాగా లాస్ట్ లో ఇచ్చిన లీడ్ తో అయితే వికారం సీక్వెల్ కోసం ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు మొదలు అవుతుంది అనే దానిపై తమిళ మీడియా వర్గాల నుంచి లేటెస్ట్ టాక్ బయటకి వచ్చింది. అయితే ఈ సినిమా వెంటనే మొదలు అయ్యే అవకాశం లేదట.

 

ఎందుకంటే ఈ చిత్రం తర్వాత కమల్ హాసన్ దర్శకుడు మహేష్ నారాయణన్ తో ఓ సినిమా చేయడానికి కమిట్ అవ్వగా ఈ గ్యాప్ లో లోకేష్ తమిళ స్టార్ హీరో విజయ్ తో మాస్టర్ సినిమా తర్వాత ఇంకో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు అయ్యాక విక్రమ్ కి మాస్ సీక్వెల్ ని స్టార్ట్ చేయనున్నారట. ఇక ఈ సినిమా వచ్చాక హైప్ ఏ లెవెల్లో ఉంటుందో కూడా చెప్పడం కష్టమే అని చెప్పాలి.