Radhe Shyam : ఇండస్ట్రీ టాక్ : “రాధే శ్యామ్” నుంచి నెస్ట్ వచ్చే అప్డేట్ ఏమిటంటే..!

Radhe Shyam : పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా డస్కీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్” ఆల్రడీ రిలీజ్ కి రెడీ గా ఉంది. ఇక ఈ మధ్యలో చిత్ర బృందం ఇతర భాషల్లో ప్రమోషన్స్ కి సిద్ధం అవుతున్నారు.

మరి కొన్ని రోజులు కితమే రిలీజ్ చేసిన ట్రైలర్ అలాగే అదే రోజు జరిగిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అది కూడా నేషనల్ లెవెల్లో జరిపిన అనంతరం మళ్ళీ ప్రెజెంట్ మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ని ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తీసుకున్నట్టు తెలిపారు..

అయితే ఈ సినిమా నుంచి ఇంకా రావాల్సిన కీలక అప్డేట్స్ ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా నుంచి ఇంకో ఆసక్తికా సాంగ్ ని రిలీజ్ చెయ్యబోతున్నారట. అది కూడా ఈ సినిమా టైటిల్ సాంగ్ అయ్యి ఉంటుందని తెలుస్తుంది.

ఆల్రెడీ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఇచ్చిన అన్ని పాటలు మంచి ఆదరణ అందుకున్నాయి. ఇక టైటిల్ సాంగ్ అంటే మరిన్ని అంచనాలు ఉంటాయి. దీనిపైనే భారీ అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తుంది మరి ఇది ఎప్పుడు వస్తుందో చూడాలి.