Radhe Shyam : ఇండస్ట్రీ టాక్ : ఇంకాస్త ముందే “రాధే శ్యామ్” భారీ రిలీజ్.?

Radhe Shyam : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రాల్లో జిల్ ఫేమ్ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ ప్యాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్ కూడా ఒకటి. ప్రభాస్ కెరీర్ లో మరో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కించిన ఈ చిత్రం విధి కి ప్రేమకి ఎదురయ్యే సవాళ్లు నేపథ్యంలో తెరకెక్కి భారీ అంచనాలు నెలకొలుపుకొని ఉంది.

మరి ఈ సినిమా రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా కరోనా వచ్చి నీళ్లు జల్లింది. ఇలా ఎక్కడెక్కడికో షిఫ్ట్ అవుతున్న ఈ సినిమాని చిత్ర బృందం ఈసారి ఎలా అయినా రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు. మరి అందుకు గాను మొదట మార్చ్ 18న డేట్ ఫిక్స్ చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పారు.

కానీ అప్పుడు మరో భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) పోటీకి రావడంతో మళ్ళీ రాధే శ్యామ్ విడుదల ఆగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ సినిమా కూడా కన్నడ సినిమా పునీత్ చివరి సినిమా రిలీజ్ కావడంతో మన రెండు సినిమాలు కూడా వాయిదా పడిపోయాయి. కానీ రాధే శ్యామ్ యూనిట్ మాత్రం కాస్త ముందే రావాలని చూస్తున్నారట.

ఇండస్ట్రీ లో లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే రాధే శ్యామ్ మార్చ్ మొదటి వారం లోనే వస్తుందని తెలుస్తుంది. అలాగే ఇది కాకపోతే ఆ రెండో వారంలో రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారట. ఏదైతే అది కానీ మూడో వారంలో అయితే సినిమా రిలీజ్ ఉండదట. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.