ఇండస్ట్రీ టాక్ : “పుష్ప” ఫైనల్ ట్రైలర్ కట్ ఎలా ఉందంటే..!

Industry Talk On Pushpa Final Trailer Cut | Telugu Rajyam

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియన్ లెవెల్లో ప్రెజెంట్ చెయ్యబోతున్న భారీ సినిమా “పుష్ప”. మరి ఈ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతున్న తరుణంలో అల్లు అర్జున్ ప్రమోషన్స్ ని చాలా సీరియస్ గా చేసేస్తున్నాడు. ప్రతీ సినిమా ఫంక్షన్ కి కూడా అటెండ్ అవుతున్నాడు.

నిన్ననే బాలయ్య “అఖండ” ఈవెంట్ కి కూడా హాజరు అయ్యాడు. మరి ఇంతలా ఆరాటపడుతున్న బన్నీ తన సినిమా ట్రైలర్ తో అందరికీ సమాధానం ఇస్తాడట. ఇండస్ట్రీలో ట్రైలర్ చూసిన వారి నుంచి సమాచారం ప్రకారం “పుష్ప” ఫైనల్ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వచ్చిందట.

ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా ఇది అని ట్రైలర్ చూసిన వారు అంటున్న మాట. మరి ఈ ట్రైలర్ వచ్చే డిసెంబర్ మొదటి వారం లోనే ఉండొచ్చని సమాచారం. ఇక ఇదెలా ఉంటుందో చూడాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles