ఇండస్ట్రీ టాక్ : ప్రభాస్ “ఆదిపురుష్” నుంచి బెటర్ గా మరో భారీ అప్డేట్??

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ తెచ్చుకున్నాక చేసిన రెండు సినిమాలు కూడా ప్లాప్ లు గానే నిలిచాయి. దీనితో ఇక అంతా తాను నటించిన మరో భారీ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ పీరియాడిక్ కం విజువల్ వండర్ గా ప్లాన్ చెయ్యగా దీని నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్ మరియు టీజర్ లు అద్భుతమైన ఆదరణ అందుకున్నాయి.

అయితే 3D వెర్షన్ మినహాయిస్తే 2D లో మాత్రం చిత్ర యూనిట్ కి భారీ షాక్ తగిలింది. దీనితో వెంటనే 3D వెర్షన్ లో టీజర్ ని గట్టిగా ప్రమోట్ చెయ్యగా దానికి బాగానే రెస్పాన్స్ వచ్చింది. కానీ సాధారణ వెర్షన్ లో ఇంకా బెటర్ గా చెయ్యాల్సి ఉంది. మరి దీనికి గాను చిత్ర యూనిట్ అయ్యితే మరో భారీ అప్డేట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ టీజర్ ని మరిన్ని బెటర్ విజువల్స్ ఉన్న దానితో రాబోతున్నారని లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్. అయితే ప్రస్తుతానికి ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో సమాచారం. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ లో అయితే సీతగా కృతి సనన్ నటించగా సైఫ్ అలీఖాన్ రావణునిగా నటించాడు.