Mahesh babu works for Prabhas : ఇండస్ట్రీ బజ్ : ప్రభాస్ సినిమా కోసం మహేష్.?సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

Mahesh babu works for Prabhas : ఏ సినిమా ఇండస్ట్రీ లో అయినా కూడా ఓ స్టార్ హీరో సినిమాకి సంబంధించి ఇంకో స్టార్ కూడా కూడా కలిసి వర్క్ చేస్తున్నాడు అనే టాక్ వినబడితే అది వేరే రేంజ్ హ్యాపీ ఆ అభిమానులకు అందిస్తుంది. అలా ఇపుడు అయితే మన టాలీవుడ్ నుంచి పలు మల్టీ స్టారర్ లు వస్తూ బిగ్గెస్ట్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాయి.

అయితే వీటిలో మల్టీ స్టారర్ లా కాకుండా పాన్ ఇండియా ఆడియెన్స్ అటెన్షన్ ని అందుకున్న భారీ సినిమా మాత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” అని చెప్పాలి. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా మార్చ్ 11న రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

మరి ఈ రిలీజ్ గ్యాప్ లో చిత్ర బృందం భారీ ప్లాన్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. అందులో భాగంగా హిందీ వెర్షన్ కి గాను అక్కడి దిగ్గజ హీరో అమితాబ్ బచ్చన్ ని వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు తీసుకోగా మన తెలుగు కి వచ్చేసరికి మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ని వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు దింపుతున్నారట.

ఇప్పుడు ఇదే బజ్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు మహేష్ వాయిస్ ఓవర్ సినిమాలు అన్నీ మంచి హిట్ అయ్యాయి ఆ సెంటిమెంట్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.