Indrani: ‘ఇంద్రాణి’ మేకింగ్ వీడియో విడుదల చేసిన సినీ బృందం..

Indrani: మొట్టమొదటి సూపర్ గర్ల్ మూవీగా ‘ఇంద్రాణి’ అనే సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాకు స్టిఫన్ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఇతర పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. భారీ వీఎఫ్ఎక్స్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో యానియా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

YouTube video player

ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ మేకింగ్ వీడియో విడుదల చేశారు సినీ బృందం. ప్రస్తుతం అది నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను చేస్తున్నప్పుడు నటుల రిస్క్ చూసి షాక్ అయ్యానని అన్నాడు ఈ సినీ డైరెక్టర్. త్వరలోనే మరో వీడియో కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.