Rocket Raghava : రాకెట్ రాఘవ రొమాంటిక్ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన ఇంద్రజ..!

Rocket Raghava : జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్లుగా ఫేమస్ అయిన వారిలో రాకెట్ రాఘవ కూడా ఒకరు. జబర్దస్త్ షో మొదలైన నాటి నుండి రాకెట్ రాఘవ ఇప్పటి వరకు ఆ షో లో స్కిట్ లు చేస్తూ తన కామెడీతో అందరిని అలరిస్తున్నాడు. అయితే గత తొమ్మిది సంవత్సరాలుగా జబర్దస్త్ ద్వారా కామెడియన్ గా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా ఇన్ని సంవత్సరాలుగా స్కిట్లు చేస్తున్న కూడా ఎక్కడ బూతు పదాలు వాడకుండా, స్కిట్ లో వల్గారిటీ లేకుండా కుటుంబంతో కలిసి చూసే విధంగా రాఘవ స్కిట్ లు ఉంటాయి.

ఇటీవల రాఘవ శ్రీదేవి డ్రామా కంపెనీల్లో కూడా సందడి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. జబర్దస్త్ లో రాఘవ తన రూటు మార్చినట్లు ఉన్నాడు. గత రెండు మూడు వారాలుగా రొమాంటిక్ స్కిట్ లు చేస్తున్నాడు. ఒక అందమైన అమ్మాయిని తన్ టీమ్ లో పెట్టుకున్న రాఘవ ఆమెతో కలిసి రొమాంటిక్ డాన్సు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా రాఘవ చిరంజీవిగారి ఒక రొమాంటిక్ పాటకి స్టెప్పులేసి అందరినీ అలరించాడు.

వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా అనే చిరంజీవి పాటకి అందిన అమ్మాయితో కలిసి ఫుల్ వైట్ కలర్ బట్టలతో వానలో తడుస్తూ డాన్సు చేశాడు. రాఘవ రొమాంటిక్ పర్ఫార్మెన్స్ చూసి అక్కడున్న వారందరూ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టారు. ఇక ఇంద్రజ అయితే వారి డాన్స్ కు ఫిదా అయిపోయి
వెరీ రొమాంటిక్ పర్ఫామెన్స్ అంటూ రాఘవను ఇంద్రజ పొగిడేసింది. మొత్తానికి రాఘవ కూడా అందరిలాగా రూటు మార్చి రొమాంటిక్ ట్రాకులతో మరింత ఫేమస్ అవ్వాలని చూస్తున్నట్టు ఉన్నాడు.