Jabardasth: రోజా చేసిన పనే చేస్తున్న ఇంద్రజ.. పాపం..?

Jabardasth: బుల్లితెర మీద ప్రసారమౌతున్న కామెడీ షో లో జబర్దస్త్ మొదటి స్థానంలో ఉండేది. కానీ ఇటీవల జబర్దస్త్ లో జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల జబర్దస్త్ రేటింగ్ పడిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు. జబర్దస్త్ కి మూలస్తంభంలో ఉన్న రోజా మంత్రి పదవి దక్కడంతో జడ్జి స్థానానికి స్వస్తి చెప్పింది. ఇక ప్రతి వారం తమ కామెడీతో అభిమానులను ఆకట్టుకునే ఆది సుధీర్ లు కూడా ఈ మధ్య జబర్దస్త్ లో కనిపించడం లేదు ఈ. ఈ కారణం వల్ల కూడా అభిమానులు నిరాశ చెందుతున్నారు.

టెలివిజన్లో ప్రసారమవుతున్న కామెడీ షో లలో టాప్ పొజిషన్లో ఉన్న జబర్దస్త్ ఇప్పుడు మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోతోంది. జబర్దస్త్ లో రోజా స్థానాన్ని ఇంద్రజ పూర్తి చేసింది. రోజా బదులు జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ జడ్జిగా ఆ స్థానానికి న్యాయం చేస్తోంది. మనో ప్రస్తుతం జబర్దస్త్ తోపాటు మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ షో కి కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. దీంతో కొన్ని సందర్భాలలో మనో స్థానంలో వేరొకరు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. కానీ మనో ఇటీవల ప్రసారమైన జబర్దస్త్ ఎపిసోడ్ లో కనిపించాడు.

ఈ ఎపిసోడ్ లో ఇంద్రజ, మనో ఇద్దరు జడ్జిలుగా వ్యవహరించారు. అయితే రోజా స్థానంలో ఉన్న ఇంద్రజ రోజా లాగే పంచులు వేస్తూ, కమెడియన్లను బాగా ఎంకరేజ్ చేస్తోంది . అంతే కాకుండా మనో పక్కన కూర్చొని రోజా లాగే మనో చేతి మీద కొడుతూ ఎంజాయ్ చేస్తోంది. జబర్థస్త్ షో నుండి రోజా వెళ్ళిన కూడా మనోకి మాత్రం దెబ్బలు తప్పటం లేదు. ఇటీవల విడుదలైన జబర్థస్త్ ప్రోమోలో ఇంద్రజ మనో చేతి మీద కొట్టే విజువల్స్ మనం చూడవచ్చు. మొత్తానికి ఇంద్రజ రోజా స్థానంలో ఉండి జడ్జిగా వ్యవహరించటమే కాకుండా రోజా ని మర్చిపోకుండా మనో ని కొడుతూ ఆయన చెయ్యి నొప్పికి కారణమవుతోంది.