ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ప్రతి వారం జబర్దస్త్ స్టేజ్ మీద పిల్లలతో కలిసి స్కిట్ చేస్తూ రాకింగ్ రాకేష్ కూడా బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఈ మధ్య కాలంలో రాకేష్ సుజాత తో ఉన్న ట్రాక్ వల్ల మరింత పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ లో ట్రాక్ లకి కొదువ లేదు. సుధీర్ – రష్మి, వర్ష – ఇమాన్యుల్ జంటలు కూడా జబర్దస్త్ లో లవ్ ట్రాక్ ల వల్ల బాగా ఫేమస్ అయ్యారు. వారి తర్వాత మరీ అంతలా ఫేమస్ అయిన జంటలలో రాకింగ్ రాకేష్ – సుజాత జంట కూడా ఒకటి. జబర్దస్త్ స్టేజ్ మీద వీరిద్దరి మధ్య ఉండే రొమాన్స్ వల్ల వీరిద్దరూ బాగా పాపులర్ అయ్యారు.
అయితే కొంత మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి స్టేజ్ మీద మాత్రమే చనువుగా ఉంటారు. కానీ సుజాత రాకేష్ జంటలు మాత్రం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎంతో చనువుగా ఉంటారు. ఇద్దరూ కలిసి వెకేషన్స్ కి వెళ్ళటం, ఒకరికొకరు ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం వంటివి చేస్తుంటారు. ఇటీవల వీరు ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో కూడా ఎంజాయ్ చేశారు . ఇలా వీరిద్దరు బయట కూడా క్లోజ్ గా ఉండటంతో నిజంగా వీరిద్దరు ప్రేమించుకొని పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా జబర్దస్త్ జడ్జి ఇంద్రజ గారు వీరి గురించి వస్తున్న వార్తలు గురించి రాకేష్ ని ప్రశ్నించింది. ఈ క్రమంలో రాకేష్ నిశ్చితార్థం గురించి మాట్లాడుతూ.. అంత సీక్రెట్ గా ఎందుకు నిశ్చితార్థం చేసుకోవాల్సి వచ్చింది? అంటూ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు స్పందించిన రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. అది నిశ్చితార్థం అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అసలు నిశ్చితార్థమే జరగలేదు కాబట్టి అంటూ సమాధానం చెప్పాడు. ఆ సమయంలో సుజాత ఎంట్రీ ఇచ్చి ఏంటి అది నిజం కాదని అంటున్నావా? అంటూ రొమాంటిక్‌గా అడగడంతో రాకేష్ తెగ సిగ్గు పడిపోయాడు. మొత్తానికి అసలు మ్యాటర్ ఏంటన్నది మాత్రం బయట పెట్టలేదు. వీరి నిశ్చితార్థం జరిగిందా? లేదా? అంటూ ప్రేక్షకులలో అనుమానం మొదలైంది.