ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను క్షేమంగా రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఉక్రెయిన్‌లో విద్యార్ధుల భద్రత కోసం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ను ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల క్షేమంపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని.. కావున కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని త్వరగా వారిని స్వదేశానికి రప్పించాలని కోరారు. దీంతో పాటు దిల్లీ, హైదరాబాద్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అవపరంమైన వారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీల వివరాలను సోమేష్ కుమార్ వెల్లడించారు.
దిల్లీలో సంప్రదించాల్సిన నెంబర్లు..
విక్రమ్‌సింగ్‌మాన్ : +91 7042566955
చక్రవర్తి పీఆర్ఓ : +91 9949351270
నితిన్ ఓఎస్డీ : +91 9654663661
ఈమెయిల్ ఐడీ : rctelangana@gmail.com
హైదరాబాద్‌లో సంప్రదించాల్సి నెంబర్లు..
ఈ.చిట్టిబాబు ఏఎస్ఓ : 040-23220603
ఫోన్ నంబర్ : +91 9440854433
ఈ-మెయిల్ ఐడీ : so_nri@telanagan.gov.in