Singer Revanth: పెళ్లి పీటలు ఎక్కిన ఇండియన్ ఐడల్ రేవంత్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Singer Revanth: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది తమ సత్తా చాటుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ సింగర్స్ లో రేవంత్ కూడా మంచి మంచి పాటలు పాడుతూ తన గాత్రంతో అందరిని అలరిస్తున్నాడు. ఇండియన్ ఐడల్-9 విజేత కూడా రేవంత్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇంతకాలం బ్యాచిలర్ గా తన లైఫ్ ఎంజాయ్ చేసిన రేవంత్ కు డిసెంబర్ 24వ తేదీన గుంటూరుకు చెందిన అన్విత తో నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇటీవల రేవంత్ అన్వితను పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. ఆదివారం నాడు జరిగిన ఈ వివాహ వేడుకకు కరోనా కారణంగా ఇరు కుటుంబ సభ్యులతో పాటు దగ్గర బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. గుంటూరులోని ఒక ఫంక్షన్ హాల్ లో నిరాడంబరంగా అత్యంత సన్నిహితుల మధ్య వీరిరువురు వివాహ బంధంతో ఒకటయ్యారు.ఈ వివాహ కార్యక్రమానికి సెలబ్రిటీలు కొంతమంది హాజరయ్యారు. పలువురు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు రేవంత్ కు ఈ సందర్భంగా బెస్ట్ విషెస్ తెలియజేశారు.

ప్రస్తుతం రేవంత్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా రేవంత్ కెరీర్ విషయానికి వస్తే ఎప్పుడు పాటలు పాడుతూ, టీవీ షోలతో నిత్యం బిజీగా ఉంటున్నాడు. ఇండియన్ ఐడల్ తెలుగు వర్షన్ లో మొదటగా రేవంత్ నీ హోస్ట్ గా తీసుకున్నప్పటికీ.. కానీ తర్వాత శ్రీ రామచంద్రని హోస్ట్ గా ప్రకటించారు. కాగా ఈ షోలో ఇద్దరు కలిపి స్టేజ్ షేర్ చేసుకుంటున్నారో..లేక ఈ షో నుండి రేవంత్ తప్పుకున్నాడో అనే విషయం తెలియాలంటే కొంత కాలం వేసి చూడాల్సిందే.