రోడ్డు మీద మిలిటరీ వాహనం ఏదైనా వెళితే, గౌరవభావంతో చూస్తాం. సైనికులు కనిపిస్తే, సెల్యూట్ చెయ్యాలనిపిస్తుంటుంది. జాతీయ జెండా రెపరెపలాడుతోంటే.. మనల్ని మనం మైమర్చిపోతాం.! ఇది సామాన్యుడు నిత్యం అనుభూతి చెందే విషయం.
కొత్తగా, ఆజాదీ కా అమృత మహోత్సవ్ వేడుకల నిమిత్తం.. సరికొత్త దేశభక్తిని ప్రదర్శించాలంటే ఎలా.? దేశ ప్రధాని నరేంద్ర మోడీ, సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్స్ జాతీయ జెండాతో రీప్లేస్ చేయాలని పిలుపునిచ్చారు. ఇళ్ళ మీద జాతీయ జెండాల్ని ఎగురవేయాలని కూడా పిలుపునిచ్చారు.
దేభభక్తిని చాటుకోవడమంటే ఇదేనా.? ప్రధాని హోదాలో దేశ ప్రజల్లో దేశభక్తిని నింపాలనుకోవడాన్ని తప్పు పట్టలేంగానీ, ఇలాంటి ప్రత్యేక పబ్లిసిటీ స్టంట్స్ ద్వారా సాధించేదేంటి.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. సైన్యంలో చేరికల విషయమై పెద్దయెత్తున దేశంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. విద్యార్థి లోకం ఆందోళనల్ని నిర్దాక్షిణ్యంగా అణచివేశారు పాలకులు.
యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణం ఆరోపణలు వస్తే, దేశ ప్రజలకు కనీసం సమాధానం చెప్పలేకపోయింది నరేంద్ర మోడీ సర్కారు. నిజానికి, దేశభక్తి వుండాల్సింది పాలకులకి.. ఇది సామాన్యులు చెబుతున్నమాట. సోషల్ మీడియా వేదికగా ఈ విషయమై కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ మీద బీభత్సమైన రీతిలో సెటైర్లు పడుతున్నాయి.
ఆగస్టు 15.. జెండా పండుగ.. ఆ రోజు జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలని ఎవరైనా ప్రత్యేకంగా సగటు భారతీయుడికి చెప్పాలా.?