స్థిరంగా కరోనా కేసులు.. దక్షిణ కొరియా, జర్మనీలో విజృంభిస్తున్న కరోనా

కరోనా కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. కొత్తగా 1,033‬ కేసులు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ కారణంగా 43 మంది మరణించారు. స్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేల దిగువకు నమోదవుతున్నాయి. 1,222 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కొన్ని దేశాల్లో కరోనా విజృభిస్తో్ంది. దక్షిణ కొరియాలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటోంది. కొత్తగా 2.86 లక్షల కేసులు నమోదయ్యాయి. 372 మంది వైరస్​కు బలయ్యారు. జర్మనీలో కూడా రెండు లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి.