Crime News: శ్రీకాకుళం జిల్లాలో దారుణం… యువతిని ఎత్తుకెళ్లి అత్యాచార ప్రయత్నం..!

Crime News: ఈ మహిళల మీద అత్యాచార ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కొంతమంది కామాంధులు వారి కామవాంఛలు తీర్చుకోవడానికి మృగాల మహిళల మీద దాడికి పాల్ప డుతున్నారు.ఇలాంటి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది.సమాజంలో ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట మహిళల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి సంఘటన ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే… శ్రీకాకుళం జిల్లా, సింగపురం పంచాయతీ దేవాంగుల కాలనీకి చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన చిన్నారావు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.స్థానికంగా పని చేసుకుని జీవిత జీవనం సాగిస్తున్న యువతిని చిన్నారావు కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. తనకి లోంగకపోతే ఎంతటి దారుణానికి వెనుకాడన నీ తరచూ యువతిని బెదిరించేవాడు.

ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం నుండి తన ఇంటికి చేరుకోవడానికి తిరుగు ప్రయాణం అయ్యి రాత్రి 9 గంటల సమయంలో సింగపురం వద్ద ఉన్న కొండమ్మ తల్లి చెరువు దగ్గర బస్సు దిగింది. యువతి ఇ వస్తున్న విషయాన్ని పసిగట్టిన చిన్నారావు యువతిని ఎత్తుకొని వెళ్లి ఆమె మీద లైంగిక దాడికి ప్రయత్నం చేశాడు.అదే సమయంలో రోడ్డు మీద అటుగా వెళ్తున్న ఒక వ్యాన్ లోని వ్యక్తులు ఈ విషయాన్ని గమనించి చిన్నారావు నుండి యువతిని కాపాడారు. ఈ విషయం గురించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.