Chalapathi Rao: నా దృష్టిలో ఎన్టీఆర్ మాత్రమే ఆర్టిస్ట్ అని ప్రముఖ సీనియర్ నటుడు చలపతి రావు అన్నారు. ఆయన తర్వాతే ఎవరైనా అని ఆయన బల్లగుద్ది చెప్పారు. తనకు తెలిసినంతవరకు నందమూరి తారక రామారావు మాత్రమే నటుడని, నాగేశ్వర్ రావు గారు కూడా కాదని వాళ్ల ముందే ఆ మాటలు అనే వాడినని ఆయన అన్నారు. అయినా కూడా వాళ్లు తనను ఏమీ అనేవారు కాదని ఆయన తెలిపారు. అందరూ తనతో సరదాగా ఉండేవారని, ప్రేమగా పలకరించేవారని, ఎవరి క్యారేజ్ ముందొచ్చినా కూడా తనని పిలిచి మరీ భోజనం పెట్టేవారని ఆయన చెప్పుకొచ్చారు.
తాను కూడా అందరితోనూ అంతే సరదాగా ఉండేవాన్ని అని చలపతిరావు అన్నారు. ఎందుకంటే తన మనసులో ఏమీ కుళ్లూ, కుతంత్రాలు లేవని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని చెప్పారు. కానీ ఎన్టీఆర్ మాత్రమే దేవుడని ఆయన మరోసారి తెలిపారు. ఆయన లాంటి నటున్ని తాను ఇప్పటికీ చూడలేదని, ఎంతో మంది పెద్ద పెద్ద రైటర్స్‌తో డిస్కషన్ చేసేవారని ఆయన చెప్పారు.
ఎన్టీఆర్ తర్వాత ఈవీవీ గారు కూడా చాలా మంది కూర్చునేవారని ఆయన అన్నారు. అందుకే వాళ్లంతా ఆ స్థాయికి చేరగలిగారని తెలిపారు. వాళ్లందరికీ సబ్జెక్ట్ మీద అంత ఆసక్తి ఉంది. అంత కష్టపడి చేశారు కాబట్టే వారికి ఆ పేరు దక్కిందని ఆయన చెప్పారు. మిగతా వాళ్లకు లేదని కాదు. కానీ వాళ్ల సంగతి తనకు తెలియలేదని ఆయన తెలిపారు. తానెప్పుడూ అలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేదని చలపతిరావు స్పష్టం చేశారు.