Crime News: ప్రస్తుత కాలంలో బాలికలు మహిళల మీద రోజు రోజుకి హత్యాచారం నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు కూడా మగవాడి కామ వాంఛలకు బలవుతున్నారు. ప్రతిరోజు ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి.మహిళల్ని రక్షించటానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రతి రోజు ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల మేడ్చల్ జిల్లాలో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… మేడ్చల్ జిల్లా లో 11 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మార్చి 31వ తేదీ పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తున్న బాలికను ఆటోడ్రైవర్ ఇంటి వద్ద దింపుతానని మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు. బాలికను ఇంటికి తీసుకు వెళ్ళకుండా దారి మళ్ళించి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా విషయాన్ని దాచి ఉంచింది.
కానీ ఈ నెల ఒకటవ తేదీన పాఠశాలలో తన స్నేహితురాలికి విషయాన్ని చెప్పగా తన స్నేహితురాలు టీచర్ కి విషయం మొత్తం తెలిపింది.ఈ క్రమంలో ఉపాధ్యాయురాలు బాధిత విద్యార్థిని పిలిపించి తీసుకుంటాను విచారించగా బాధితురాలు జరిగిన విషయాన్ని ఉపాధ్యాయులకు వివరించింది.దీంతో ఉపాధ్యాయురాలు బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చింది.
కానీ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పరువు పోతుందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో మరొకసారి ఉపాధ్యాయురాలు బాధ్యత తల్లిదండ్రులకు సర్దిచెప్పి నిందితుడు మీద పోలీసులకు ఫిర్యాదు చేయించింది. పోలీసులు బాధితురాలి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని బాలిక మీద అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.