Jr.NTR: కొరటాల – ఎన్టీఆర్ సినిమా స్పెషల్ సాంగ్ లో సందడి చేయనున్న…. వరుణ్ తేజ్ హీరోయిన్?

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా మార్చి 25 వ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూనే రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ హీరోగా తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.ఇక పోతే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.

ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్ర ద్వారా సందడి చేయనున్నారు.ఇప్పటికే కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సినిమాలోని ఐటమ్ సాంగ్ ఉండటం సర్వసాధారణం. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం స్టార్ హీరోయిన్లు సైతం డాన్సులు వేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇటీవల పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉందని ఆ స్పెషల్ సాంగ్ లో మరొక హీరోయిన్ సందడి చేయబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కొరటాల ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా వరుణ్ తేజ్ లోఫర్ హీరోయిన్ దిశా పటాని ఈ స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమెతో సంప్రదింపులు జరిగాయని కొరటాల శివ ఈమెను ఎంపిక చేశారనే వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే చిత్రం బృందం నుంచి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.