Crime News: ఈ రోజుల్లో ప్రేమ పేరుతో అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమ పేరుతో యువత వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఎంతోమంది అమ్మాయిలు ప్రేమించి మోసపోతే.. మరి కొంతమంది అమ్మాయిలు ప్రేమను నిరాకరించడంతో వారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. అచ్చం ఇలాంటి సంఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. పట్టపగలు అందరిముందూ ఒక అమ్మాయిని గొంతు కోసి చంపుతుంటే ఎవరు అడ్డుకోక పోగా ఫోన్ లో వీడియోలు తీస్తున్నారు.
వివరాలలోకి వెళితే..ఫిబ్రవరి 12న కామ్రేజ్ పసోదరా ప్రాంతంలోని గ్రీష్మ అనే యువతిని ఫెనిల్ గొయాని అనే వ్యక్తి ఆమె ఇంటికి వెళ్లి తల్లి తండ్రులు, బంధువుల కళ్ళెదుట దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య గుజరాత్ లో తీవ్ర దుమారం రేపింది. అమ్మాయి గొంతు కోసి చంపుతుంటే చుట్టుపక్కల వారు చూస్తూ.. వీడియోలు తీస్తూ ఉండిపోయారే తప్ప, ధైర్యం చేసి గ్రీష్మను కాపాడే యత్నం చేయలేకపోయారు. ఎవ్వరినీ దగ్గరికీ రానివ్వకుండా కత్తితో అందరిని బెదిరించాడు.
ఫెనిల్,గ్రీష్మ ఇద్దరు కలిసి చదువుకున్నారు.ఫెనిల్ సరైన
అటెండెన్స్ లేక డిబార్ అయ్యాడు. తర్వాత గ్రీష్మను తరచూ ప్రేమ పేరుతో వేదించటంతో ఆమె తల్లి తండ్రులు కూడా అతనికి వార్నింగ్ ఇచ్చారు.ఆ కోపంతో ఫెనిల్ గ్రీష్మ ఇంటికి వచ్చి తన తల్లి తండ్రులు, బంధువు చూస్తుండగానే కత్తితో గొంతు కోసి చంపాడు. కళ్ళ ఎదుటే కన్న కూతురు చనిపోతున్న ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న ఆ తల్లితండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. ఘటన జరిగిన 4 రోజుల తర్వాత ఫెనిల్ నీ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.