Africa Train Accident: ఆఫ్రికాలో పట్టాలు తప్పిన రైలు.. 61 మంది దుర్మరణం

Africa Train Accident: ప్రమాదాలు ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరు ఊహించలేరు. అలా ఇప్పటికి ఎన్నో ఘోరమైన ప్రమాదాలు జరగటంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చాలావరకు పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతూ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. అలా తాజాగా ఆఫ్రికాలో ఘోరమైన రైలుప్రమాదం చోటు చేసుకుంది.

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోకు ఆగ్నేయ ప్రాంతంలో కొల్వేజి నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో బయోఫ్వే వద్ద రవాణా సరుకు చేసే రైలు పట్టాలు తప్పటంతో అందులో ఏడు బోగీలు పక్కన ఉన్న లోయలో పడిపోయాయి. దీంతో ఆ ప్రమాదంలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 52 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. అధికారుల సమాచారం ప్రకారం భోగిలో చాలావరకు మృతదేహాలు చిక్కుకున్నాయని తెలిపారు. సరుకు రవాణా రైలు కొన్ని బోగీలతో ఖాళీగా ఉండటంతో వందలాది ప్రయాణికులను ఎక్కించారని తెలుస్తోంది.