బుల్లెట్ భాస్కర్ పై నిజంగానే దాడి చేసిన ఇమ్మానియేల్.. షాక్ లో టీమ్?

తెలుగు బుల్లితెర కార్యక్రమాల్లో జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి గుర్తింపు ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం వెండితెరపై ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే హైపర్ ఆది సుడిగాలి సుధీర్ గెటప్ శీను వంటి వాళ్లు ఈ కార్యక్రమానికి దూరం కాగా ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ వంటి వారి టీమ్స్ ఎంతో అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఇకపోతే బుల్లెట్ భాస్కర్ టీమ్ లో వర్ష, ఇమ్మానియేల్ పైమా నటిస్తున్నారనే విషయం తెలిసిందే. బుల్లెట్ భాస్కర్ టీం లో భాగంగా వీరందరూ కలిసి రచ్చ మామూలుగా ఉండదు.

తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో సందడి చేసిన ఇమ్మానియేల్ ఏకంగా తనని వేదికపై కొట్టడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇమ్మానియేల్ బుల్లెట్ భాస్కర్ ని కొట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. బుల్లెట్ భాస్కర్ సర్కార్ వారి పాట సినిమా థీమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే బుల్లెట్ భాస్కర్ వర్షకి 10 లక్షలు అప్పుగా ఇస్తారు.10 లక్షల రూపాయలు తీసుకున్న వర్ష ఇమ్మానియేల్ లో వివాహం చేసుకుంటుంది.

బుల్లెట్ భాస్కర్ భార్యగా నటించిన పైమా తనకు 10 లక్షలు కావాలని అడగడంతో బుల్లెట్ భాస్కర్ వర్ష దగ్గర ఆ డబ్బు తీసుకోవడానికి వెళ్తాడు. అయితే తాను ఇమ్మానియేల్ నుపెళ్లి చేసుకుందని తెలిసే ఎలాగైనా తన డబ్బు కట్టాలని డబ్బు కట్టే వరకు తన ఇంట్లో పనులు చేయాలని తనను తీసుకువెళ్తారు. వర్ష వెనుక ఇమ్మానియేల్ కూడా వెళ్తాడు.అయితే బుల్లెట్ భాస్కర్ ఇమ్మానియేల్ మధ్య మాటా మాటా పెరిగి అతనిని కొట్టే సన్నివేశం ఉంది. స్కిట్ లో బాగా లీనమైపోయిన ఇమ్మానియేల్ నిజంగానే బుల్లెట్ భాస్కర్ ని గట్టిగా కొడతాడు. ఈ విధంగా బుల్లెట్ భాస్కర్ ని కొట్టడంతో స్కిట్ మధ్యలో ఆపకుండా తనకు క్షమాపణ చెప్పి స్కిట్ లో నటిస్తారు . ఈ విధంగా ఇమ్మానియేల్ బుల్లెట్ భాస్కర్ ను నిజంగానే కొట్టడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.