Kalyan Dev: సంతోషంతో ఉన్న… మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్!

Kalyan Dev: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో గా రాణిస్తున్నాడు. చిరంజీవి కూతుర్లు సుస్మిత,శ్రీజ. సుస్మిత ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా, ఫ్యాషన్ డిజైనర్ గా అందరికీ సుపరిచితమే. చిన్న కూతురు శ్రీజ కూడా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. శ్రీజ మొదట పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని ఒక పాపకి కూడా జన్మనిచ్చింది. కానీ వారివురి మద్య మనస్పర్థల కారణంగా శ్రీజ మొదటి భర్త నుండి విడిపోయారు.

శ్రీజ మరల కళ్యాణ్ దేవ్ నీ వివాహం చేసుకొని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇంత కాలం వారిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఇటీవల కళ్యాణ్ దేవ్ మెగా కుటుంబంలో ఈ మధ్య కనిపించకపోవడం తో అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. పైగా శ్రీజ కూడా శ్రీజ కళ్యాణ్ గా ఉన్న తన ఇంస్టాగ్రామ్ ఐడి ని శ్రీజా కొణిదెల గా మార్చడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. వారిద్దరూ ప్రస్తుతం దూరంగా ఉంటున్నారని, సమంత-నాగ చైతన్య లాగ వీరు కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు విడాకుల విషయం పై స్పందించలేదు.

ఇదిలా ఉండగా తాజాగా కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమాకు ఆశించిన ఫలితం అందలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా మెగా కుటుంబం ఎక్కడ కనిపించలేదు. కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటున్నాడు. ఇటీవల తన కొత్త లుక్ తో ఉన్న ఫోటో షేర్ చేశాడు. తాజాగా కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో సముద్రపు అలల మద్యలో ఉదయిస్తున్న సూర్యుడి ఫోటో ఒకటి షేర్ చేస్తూ దానికి ఎన్నో ఆశలతో ప్రేమగా,సంతోషంగా ఉన్నట్టు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.