నేను బిగ్ బాస్ షోకు కొడుకుని కాదు…నేనే బిగ్ బాస్ విన్నర్… అఖిల్ షాకింగ్ కామెంట్స్!

ఓటీటీలో ప్రసారమైన ద బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్. ఇటీవల ఈ నాన్ స్టాప్ సీజన్ ముగిసింది. ఈ నాన్ స్టాప్ సీజన్ లో నటి బిందు మాధవి టైటిల్ గెలుచుకోగా అఖిల్ నిలిచాడు. అయితే అఖిల్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కూడా రన్నర్ గా నిలవగా అభిజిత్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇప్పుడు ఈ నాన్ స్టాప్ సీజన్ లో కూడా మళ్ళీ అలాగే రన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అఖిల్ పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ బిగ్ బాస్ షో గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన నేను బిగ్ బాస్ షో లో రన్నర్ గా నిలిచినవాడినప్పటికీ అందరూ విన్నర్ గానే చూస్తున్నారని అఖిల్ సార్థక్ చెప్పుకొచ్చాడు. టైటిల్ దక్కకపోవడంతో నేను ఏడ్చేశానని నా గురించి తప్పుడు వార్తలు రాసి ప్రచారం చేస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చాడు. అయినా ఒకసారి దెబ్బ తగిలిన వాళ్లకు మళ్లీ దెబ్బ తగిలితే పెద్దగా బాధ ఉండదు అంటూ అఖిల్ చెప్పుకొచ్చారు.

బిందు టైటిల్ గెలవటం వల్ల తనకు ఎటువంటి బాధ లేదని, బిందు నేను ఇద్దరం చాలా సరదాగా కలిసి ఉంటామని అఖిల్ చెప్పుకొచ్చారు. బిందు చాలా సంవత్సరాల నుండి సక్సెస్ కోసం చాలా ఎదురు చూస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో ఆమె విన్ నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో యాంకర్ మీరు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 6 లోకి వస్తారా అని అడగ్గా నేను ఏమి బిగ్ బాస్ వాళ్ళకి కొడుకుని కాదు. ప్రతిసారీ నాకు అవకాశం ఇవ్వటానికి అని సమాధానం చెప్పాడు. అఖిల్ ఇలా మాట్లాడటంతో ఆ కామెంట్స్ ఇప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.