Affairs: భార్య ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధం.. ఇద్దరినీ పోషించలేక చివరికి ఇలా!

Affairs: ప్రస్తుత కాలంలో ఎన్నో అక్రమ సంబంధాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఇలా అక్రమ సంబంధాలు బయటపడటంతో హత్యలు చేయడం లేదా ఆత్మహత్య చేసుకోవడంతో వారిపై ఆధారపడి ఉన్న ఇతర కుటుంబ సభ్యులు కూడా అనాధలుగా మిగిలిపోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటన ఒకటి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల లోకి వెళ్తే…

అనంతపురం జిల్లాలోని నవోదయ కాలనీలో నివాసముంటున్న సాగే నాగేంద్ర అనే వ్యక్తి ఒక డ్రిప్ కంపెనీలో డిస్టిక్ కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. ఇతనికి కొంతకాలం క్రితం జ్ఞానేశ్వరి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు. ఉద్యోగం నిమిత్తం చిత్తూరు ట్రాన్స్ఫర్ అయిన నాగేంద్రకి అక్కడ దుర్గ భవాని అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అతను చిత్తూరు నుంచి తిరిగి అనంతపురం వస్తున్న సమయంలో దుర్గాభవాని కూడా వెంట పెట్టుకుని అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఆమెను ఉంచాడు ఉంచాడు.

ఇలా పెళ్లయి బిడ్డలు ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని రెండింటి ఖర్చులను తానే భరించేవాడు.ఇలా రెండు కుటుంబాలను పోషించడానికి అధిక మొత్తంలో ఖర్చు కావడంతో ఆ ఖర్చులను భరించలేక ఎంతో మనస్తాపానికి చెందిన నాగేంద్ర ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఉరివేసి కొని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన భార్య తన భర్త స్నేహితుడికి ఫోన్ చేసి ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. అనంతరం పోలీసుల సహాయంతో తలుపు తీయడంతో అప్పటికే నాగేంద్ర మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.