Pragathi:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. నటి ప్రగతి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు సంబంధించిన ఎన్నో డాన్స్ వీడియోలను.. వర్కౌట్స్ చేస్తూ ఉన్న వీడియోలను అభిమానులతో పంచుకుంటూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ప్రగతి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలామంది అవకాశాల కోసం ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని వారి కెరీర్ మొత్తం నాశనం చేసుకున్నారని ఎన్నోసార్లు బయటపెట్టారు. ఇకపోతే ప్రగతి కూడా తన కెరియర్ మొదట్లో ఇలాంటి ఇబ్బందులు వచ్చాయని తెలిపారు.
తనకు సినిమా అవకాశాలు కావాలంటే దర్శక నిర్మాతలే కాకుండా ఒక స్టార్ హీరో కూడా ఒక రోజంతా తనతో గడపమని చెప్పారని అప్పుడే తనకు సినిమాల్లో అవకాశం వస్తుందని ఆ హీరో చెప్పినట్లు ఈ సందర్భంగా ప్రగతి క్యాస్టింగ్ కౌచ్ గురించి బయట పెట్టారు. అయితే ఆ హీరో ఎవరు అనే విషయం చెప్పకపోవడం గమనార్హం. ఎవరైతే అవకాశాలు కోసం ఇలా లొంగిపోతారో అలాంటి వారి జీవితం నాశనం అవుతుందని ప్రతిభతోనే ఇండస్ట్రీలో కొనసాగాలని ఈమె ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.