Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలోటాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం అన్ని భాషలలో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు.ఇలా ఒక్కో సినిమాకు సుమారు రెండు నుంచి మూడు కోట్ల వరకు పారితోషికం తీసుకోవడమే కాకుండా పలు బిజినెస్ లను చేస్తూ..ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతులా డబ్బులు సంపాదిస్తుందని చెప్పవచ్చు.
ఈ విధంగా కెరియర్లో దూసుకుపోతున్న సమంతా తన వస్త్రధారణ విషయంలో కూడా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తారు.ఈ క్రమంలోనే ఆమె ధరించే దుస్తులు ఎంతో ఖరీదైనవిగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ స్విట్జర్లాండ్ పర్యటన వెళ్లి మంచు కొండలో స్కైయింగ్ చేస్తున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో సమంత పసుపు రంగు జాకెట్ ధరించి ఉన్నారు. అయితే సమంత ధరించిన ఈ జాకెట్ ధర తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే.
స్కైయింగ్ ఈ సమయంలో సమంత ధరించిన పసుపు రంగు జాకెట్ ఏకంగా 75000 రూపాయలు అటూఇటుగా ఉంటుందని సమాచారం. కేవలం ఒక జాకెట్ ఈ రేంజ్ లో డబ్బులు ఖరీదు చేసేది కొన్నారంటే సమంత క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే ప్రస్తుతం ఈమె సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా యశోద చిత్రంలో బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలకు వెబ్ సిరీస్ లకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.