వాములో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలిస్తే.. అస్సలు వదలలేరు!

ఈ రోజుల్లో మనకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా టాబ్లెట్లపై ఆధారపడతాం. దీనివల్ల మన శరీరంలో సహజంగా ఉండే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. దీనిని తిరిగి పొందాలంటే వాము అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఇళ్లల్లో వాము అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఒక రకమైన ఘాటు సువాసన ఇచ్చే వాము ఎంతో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. వాము కాస్త చేదుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి మంచిదని కర్రీలలో చట్నీలలో వినియోగిస్తుంటారు.

ఆహారం తీసుకున్న తర్వాత అది అరగక, ఎసిడిటీ సమస్య ఉంటే వాము కలిపిన భోజనం తినాలి. అప్పుడు పొట్టలో ఉన్న గ్యాస్ సమస్యలన్నీ తొలగిపోతాయి. రోజు ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ వాము, అర టీ స్పూన్ అల్లం పొడి నీళ్లలో కలిపి తాగితే చాతిలో మంటలు తగ్గుతుంది. ముక్కులో సమస్యలు ఉన్న, ముక్కు దిబ్బడను సరిచేస్తుంది. వాము, బెల్లాన్ని వేడి చేసి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు స్పూన్లు తీసుకోవాలి. ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి సమస్యలు తొలగుతాయి.

మైగ్రేన్ తలనొప్పి ఉన్నట్లయితే వాము పొడిని ఒక చిన్న గుడ్డలో చుట్టి దాన్ని పీల్చుతూ ఉంటే తలనొప్పి తగ్గి ఉపశమనం లభిస్తుంది. ఇక జుట్టు తెల్లబడడం, జుట్టు రాలడం, చుండ్రు సమస్య ఉన్నట్లయితే వాము, కరివేపాకు, ఎండు ద్రాక్ష, చక్కెరను ఒక కప్పు నీటిలో వేసి ఉడికించి ఆ నీటిని రోజు త్రాగడం ద్వారా జుట్టు సమస్యలు తగ్గడం కొద్ది రోజుల్లోనే చూడవచ్చు.

ఆవనూనె, వాము పొడిని కిటికీల దగ్గర, తలపుల దగ్గర, గుమ్మం దగ్గర, ఇంకా ఇంట్లో అన్ని మూలల రాస్తే ఇంట్లోకి దోమలు రాకుండా ఇంట్లో సువాసన ఉంటుంది. చర్మంపై మొటిమలు,మచ్చలు ఉంటే కాస్త వాముపొడిని కొంచెం నీటితో పేస్ట్ లాగా చేసుకుని ముఖంపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. శరీరంపై ఎక్కడైనా నొప్పి, మంట, దురద లాగా అనిపిస్తే అక్కడ వాముపొడి పేస్టు రాసినట్లయితే రాసి 15 నిమిషాల తర్వాత తీసేస్తే మంచి ఫలితం ఉంటుంది.