Meka Ramakrishna: సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆర్టిస్టుల జీవితాలు మనం అనుకున్నంత సుఖంగా సంతోషంగా వారి జీవితం సాగిపోతుంది మనం భావిస్తాము.తెరపై నవ్వుతూ కనిపించే ఈ సెలబ్రిటీల తెర వెనుక జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ మేక రామకృష్ణ ఓ ఇంటర్వ్యూ ద్వారా ఇండస్ట్రీలో ఆర్టిస్టుల జీవితాలు ఎలా ఉంటాయో తెలియజేశారు.ఈ సందర్భంగా ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ బాయ్స్ గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.
ఇండస్ట్రీలో క్యాడర్ బట్టి ఆర్టిస్టులకు గౌరవం మర్యాద దక్కుతుందని సెకండరీ గ్రేడ్ ఆర్టిస్టుల గురించి అయితే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయని తెలిపారు. వారికి పెట్టే ఫుడ్డు నుంచి ఇచ్చే మర్యాద వరకు ప్రతి ఒక్కరు చిన్నచూపు చూస్తారని తెలిపారు.అడుక్కునే వారికైనా మర్యాద ఇస్తారు కానీ సెకండరీ గ్రేడ్ ఆర్టిస్టులకు ఏ మాత్రం మర్యాద ఇవ్వరని కొందరు ప్రొడక్షన్ బాయ్స్ అలాంటి వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తారని తెలిపారు.
ఇలా తనని కూడా ఎన్నోసార్లు అవమానించారని ఈ క్రమంలోనే వారిని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని మేక రామకృష్ణ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ప్రొడక్షన్ బాయ్స్ చేసే ఈ వ్యవహారాలన్నీ దర్శక నిర్మాతలకు ఏమాత్రం తెలియదు. ఒకవేళ మనం వాళ్లను తిడితే మనపై ప్రతీకారంతో కాఫీలో మోషన్ టాబ్లెట్స్ వేయడం, నీళ్లు అడిగితే టాయిలెట్లో వాటర్ ను బాటిల్లో నింపుకొని తెచ్చి ఇచ్చేవారని ఈయన ఇండస్ట్రీలో ఆర్టిస్టుల జీవితాల గురించి తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఆర్టిస్టులకు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని నటి జయసుధ విషయంలో కూడా ఇలాగే జరిగిందని ఈ సందర్భంగా మేక రామకృష్ణ ప్రొడక్షన్ బాయ్స్ గురించి ఎన్నో విషయాలు బయట పెట్టారు.