వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి…?

వర్షాకాలం అనగానే ఎన్నో ఆరోగ్య సమస్యలను వెంటబెట్టుకుని వస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో పాటు అనేక ఇన్ఫెక్షన్స్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందువల్ల వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ నుంచి సీజనల్ వ్యాధుల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మనం తీసుకునే ఆహారం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండటానికి ఈ సీజన్ లో లభించే సీజనల్ ఫ్రూట్స్ తినటం చాలా అవసరం. ఆపిల్, చెర్రీ, లిచీ, బొప్పాయి వంటి సీజనల్ ఫ్రూట్ తినటం వల్ల ఇవి శరీరంలో వ్యాది నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వర్షాకాలంలో వీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లుకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

మన ఇంట్లో లభించే అల్లం వెల్లుల్లితో వర్షాకాలంలో వచ్చే అనేక వ్యాధులు దరిచేరకుండా కాపాడవచ్చు. అల్లం వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్, యాంటీ ఇన్ఫర్మేటరీ లక్షణాలు వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు జ్వరం తలనొప్పి వంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా చేస్తాయి. అందువల్ల అల్లం వెల్లుల్లితో తయారు చేసిన వంటలను తరచు తీసుకోవాలి లేదా వీటితో కషాయం చేసి తాగినా కూడా వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి బయటపడవచ్చు.

ఇక వర్షకాలంలో హెర్బల్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీన్ టీ, జింజర్ టీ వంటి హెర్బల్ టీ లు తాగటం వల్ల శరీరంలో వ్యాధనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. దీంతో అనేక రకాల వ్యాదులు దరి చేరకుండా ఉంటాయి. ఇక వర్షాకాలంలో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఉదయ గారి ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఎంతో దోహదపడతాయి