ఓటీటీ వద్దంటే జోమాటో స్విగ్గి కూడా బ్యాన్ చేయాలి.. వర్మ కామెంట్స్ ?

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఏం మాట్లాడినా వివాదాస్పదంగా మారుతాయి.ఐతే ఆయన మాట్లాడే మాటలను లోతుగా పరిశీలిస్తే అందులో నిజం ఉంటుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చిత్ర నిర్మాణం గురించి చర్చలు జరుగుతున్న జరుగుతూ సినిమా ఇండస్ట్రీకి ఓటీటీ వల్ల నష్టం ఏర్పడుతుందని అందుకే సినిమాలను ఓటీటీలలో ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఓటీటీలని నిలిపివేస్తే ఇండస్ట్రీకి లాభాలు ఉంటాయనీ పలువురు భావిస్తున్న నేపథ్యంలో వర్మ ఈ వ్యాఖ్యలపై స్పందించారు.

ఓటీటీలను బ్యాన్ చేయాలి అంటే హోటల్ యాజమాన్యం, ఫుడ్ యాజమాన్య సంస్థ స్విగ్గి, జొమాటో బ్యాన్ చేయాలని చెబుతున్నట్టు ఉంది. స్విగ్గి జొమాటో వల్ల హోటల్ యాజమాన్యానికి లాభాలు ఉన్నాయి. అలాగే ఓటీటీల వల్ల ఇండస్ట్రీకి ఎంతో లాభం ఉందని ఈ సందర్భంగా వర్మ వెల్లడించారు. ఇకపోతే థియేటర్లో చూడాలనుకునేవారు ఎప్పుడైనా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తారని చూడకూడదు అనుకున్న వారు ఎప్పటికీ థియేటర్ కి రారని ఈ సందర్భంగా ఈయన తెలిపారు.

ఇకపోతే థియేటర్లో సినిమా చూడటానికి ఆసక్తి లేనివారు సినిమాని ఎంత ఆలస్యంగా అయినా ఓటీటీలలో విడుదల చేసిన థియేటర్ కు రానివారు ఎప్పటికీ రారని వర్మ ఈ సందర్భంగా తెలిపారు. ఈ విధంగా వర్మ ఓటీటీల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి వర్మ వ్యాఖ్యలపై నిర్మాతల స్పందన ఏ విధంగా ఉంటుందో తెలియాల్సి ఉంది.