Devotional Tips: వేసవిలో ఈ వస్తువులను దానం చేస్తే… చాలు మీకు తిరుగులేదు?

Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దానధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని భావిస్తారు. ఈ క్రమంలో మన స్థోమతకు తగ్గట్టుగా దాన ధర్మం చేయటం వల్ల అన్ని మంచి ఫలితాలని పొందవచ్చని భావిస్తున్నాము. ఇకపోతే వేసవి కాలంలో కొన్ని రకాల వస్తువులను దానం చేయడం వల్ల ఎంతో శుభ ఫలితాలను పొందవచ్చు. మరి వేసవి కాలంలో ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయానికి వస్తే…

వేసవికాలంలో అన్నదానం కన్న నీటి దానం ఎంతో గొప్పది. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా ఎన్నో మూగజీవాలు దాహంతో అల్లాడిపోతూ ఉంటాయి. అందుకే నీటి దానం చేయటం వల్లశుభ ఫలితాలు కలుగుతాయి అందుకే వేసవి కాలంలో చాలామంది చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు.ఇక చలివేంద్రాల కోసం మనం దానం చేసే కుండల పై ఒకటి మన పూర్వీకుల పేరుమీదుగా దానం చేయాలి. మరొకటి విష్ణుభగవానుడు పేరుపై దానం చేయటం మంచిది.

మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే వేసవికాలంలో మామిడి పండ్లను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇలా మామిడి పండ్లను దానం చేయడం వల్ల సూర్యుడు బలపడి విజయాలను కలిగిస్తాడు. అలాగే సూర్యుడు స్థానం బలపడాలి అంటే బెల్లం కూడా దానం చేయటం ముఖ్యం. ఇలా బెల్లం దానం చేయటం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే సమాజంలో కీర్తిప్రతిష్టలను కూడా పొందుతారు.