Shekar kammula: రాజమౌళితో సినిమా చేస్తే ఫ్లాప్ అవుతాయి శేఖర్ కమ్ములతో చేస్తే విడాకులు… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్!

Shekar kammula: సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి వచ్చే మీమ్స్ చాలా క్రేజీగా ఉంటాయి. సోషల్ మీడియా వేదికగా మీమర్స్ ఇలాంటి క్రేజీ మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఇలాంటి మీమ్స్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రాజమౌళి గురించి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.సాధారణంగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసిన తర్వాత తదుపరి చిత్రాలు తప్పనిసరిగా ఫ్లాప్ అవుతాయనే అందరూ భావిస్తారు.ఇలా ఇప్పటికే ఎంతోమంది ఈ విషయాన్ని డైరెక్ట్ గా రాజమౌళి దగ్గర కూడా ప్రస్తావించారు.

ఇదిలా ఉండగా తాజాగా ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకోవడంతో ఈ వ్యవహారం మధ్యలోకి డైరెక్టర్ శేఖర్ కమ్ములని లాగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి శేఖర్ కమ్ములకు మధ్య పెద్ద ఎత్తున మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎవరైనా సినిమాలు చేస్తే తప్పకుండా వారు విడాకులు తీసుకోవాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గోదావరి సినిమా ద్వారా సుశాంత్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ఈ సినిమా చేసిన ఏడాదే సుమంత్ కీర్తి రెడ్డికి విడాకులు ఇచ్చారు. అదేవిధంగా 2021లో అక్కినేని నాగచైతన్య హీరోగా లవ్ స్టోరీ సినిమా తీశారు.

ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకున్నప్పటికీ ఈ సినిమా విడుదలైన 10 రోజులకే నాగచైతన్య సమంత విడాకుల గురించి ప్రకటించారు.ఇదిలా ఉండగా తాజాగా మరొక జంట కూడా విడాకులు తీసుకుంటూ వార్తల్లో నిలిచారు.తమిళ స్టార్ హీరో ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని ప్రకటించిన కొన్ని రోజులకే ఈ దంపతులు విడాకులు తీసుకోవడం తో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇలా జరగడంతో శేఖర్ కమ్ముల పై నెటిజన్లు పెద్దఎత్తున మీమ్స్, ట్రోల్స్ క్రియేట్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.