Crime News: ప్రస్తుతకాలంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. కొంత మంది కామాంధులు వారి కామవాంఛ తీర్చుకోవడానికి వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు ఎవరిని వదిలి పెట్టడం లేదు. ఇలాంటి కామాంధుల ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయటానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు అమలు చేసినప్పటికీ వీరి ఆగడానికి అంతం లేకుండా పోతోంది. చిన్నపిల్లలు అన్న ఇంకిత జ్ఞానం లేకుండా కొంతమంది ప్రవర్తిస్తుంటే.. పసిపిల్లల బంగారు భవిష్యత్తుకు మార్గం చూపే గురువులే విద్యార్థుల పాలిట కీచకులుగా మారుతున్నారు. ఇటీవల ఇలాంటి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాలలోకి వెళితే…అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం లోని శ్రీధర గట్ట గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు వ్యాయామ పాఠాలు నేర్పవలసిన గురువే విద్యార్థులతో నీచంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలలోని వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రతిరోజు విద్యార్థిని ఇంట్లో ఉన్న సెల్ఫోన్ కు మెసేజ్ లు ,ఆడియో చాటింగ్ చేస్తూ విద్యార్థనీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థినికి ఆడియో చాటింగ్ చేస్తూ తన భార్యకు ఆరోగ్యం బాగా లేక పోవడం వల్ల తన కోరికలను తీర్చాలని విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఈ విషయం బయట పడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఎవరికీ చెప్పకుండా ఆ విద్యార్థి మనసులో దాచుకుంది.
ఇదే తరుణంలో ఒకరోజు విద్యార్థిని ఇంట్లో లేని సమయంలో ఉపాధ్యాయుడు ఫోన్ చేయగా కుటుంబ సభ్యులు ఫోన్ లిఫ్ట్ చేయటం తో మొత్తం విషయం బయటపడింది. ఈ విషయం పట్ల విద్యార్థి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయుడి తీరుపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇలాంటి నీచానికి పాల్పడిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన మీద ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి ఆ కీచక ఉపాధ్యాయుడు మీద కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.