Sreekanth: క్రికెట్ ఆడడానికి వెళ్తే అక్కడ తరుణ్, శ్రీకాంత్ వీళ్లు పరిచయమయ్యారని నటుడు అనంత ప్రభు అన్నారు. ఏదైనా బాధ వచ్చినా, సంతోషం వచ్చినా వారితోనే పంచుకుంటానని ఆయన చెప్పారు. శ్రీకాంత్ గారితో తనకు క్రికెట్ ఆడక ముందే పరిచయమన్న ఆయన, అంతకు ముందే ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించానని ఆయన అన్నారు. అప్పటి నుంచి శ్రీకాంత్ గారితో తన ప్రయాణం సాగుతూ వస్తోందని ఆయన తెలిపారు.
ఫిలింనగర్‌లో చాలా మంది హీరోలున్నప్పటికీ తాను మాత్రం తన ఎమోషన్స్‌ను శ్రీకాంత్ గారితోనే ఎక్కువగా పంచుకుంటానని ప్రభు చెప్పారు. ఆయనే ఎందుకు అంటే నిజానికి అసలు కారణం తనక్కూడా తెలియదన్న ఆయన, శ్రీకాంత్ గారికి తాను నచ్చడం నిజంగా అదృష్టంగా భావిస్తానని ఆయన అన్నారు. ఆయన తర్వాత అంటే తరుణ్, నరేశ్ లాంటి వాళ్లు కూడా తనతో క్లోజ్‌గా ఉంటారని ఆయన చెప్పారు. కానీ ఎక్కడికెళ్లినా కూడా ఎవరైనా సరే ఒక లిమిట్ వరకే ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరూ ఆ గీత గీసుకొని ప్రవర్తించాలని ఆయన చెప్పారు.
లేదంటే అడ్వాంటేజ్ తీసుకుంటామని, అది ఆ లైన్ దాటి పోకూడదని ప్రభు అన్నారు. ఇప్పటికీ శ్రీకాంత్ గారింటికి వెళ్తే భోజనం చేసి వెళ్లమని అంటారని ఆయన తెలిపారు. తరుణ్‌తో కూడా ఏదైనా అకేషనల్లీ పార్టీ ఉన్నపుడు వెళ్తూ ఉంటానని ఆయన చెప్పారు. నిజంగా అలాంటి వాళ్లు తన లైఫ్‌లో ఉండడం తన అదృష్టమని ఆయన తెలిపారు. అలాగే తొట్టెంపూడి వేణు కూడా చాలా సరదాగా ఉంటారన్న ప్రభు, వాళ్లింట్లో వాళ్లు సైతం తనను ఆప్యాయంగా పలకరిస్తారని ఆయన చెప్పారు. ఎవరితో ఎంత క్లోజ్‌గా ఉన్నా కూడా తన లిమిట్స్‌లో తాను ఉంటానని